టీఆర్ఎస్ ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ | T cong mlcs takes on trs government | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్

Jul 5 2016 2:07 PM | Updated on Sep 4 2017 4:11 AM

వ్యవసాయం, విద్య, వైద్య శాఖలలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు.

హైదరాబాద్ : వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ...  రైతులకు రుణమాఫీ చేయకపోవడం అన్యాయమని వారు విమర్శించారు.

ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా ఇప్పటి వరకు విత్తనాలు దొరకడం లేదన్నారు. తనిఖీల పేరుతో వందల కాలేజీలు మూతపడేలా చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తున్నారని షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement