హైదరాబాద్ చేరుకున్న సురేష్ ప్రభు | suresh prabhu came to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న సురేష్ ప్రభు

May 30 2016 10:26 PM | Updated on Sep 4 2018 5:21 PM

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికారు.  ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున సురేష్ ప్రభు రాజ్యసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ఓ రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, సురేష్ ప్రభుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆంద్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement