ఏప్రిల్‌ 2 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు | Summative assessment tests from April 2 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 2 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు

Jan 6 2018 2:12 AM | Updated on Jan 6 2018 2:12 AM

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి రిపోర్టు కార్డులను ఏప్రిల్‌ 12 కల్లా అందించేలా అన్ని పాఠశాలలకు సూచించాలని డీఈవోలను కోరింది. 

Advertisement
 
Advertisement
Advertisement