కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మేధావుల నుంచి తాము ఇప్పటికే గణనీయంగా సూచనలు,సలహాలు స్వీకరించామని ఇకపై సూచనలు, సలహాలతో కాలయాపన చేయకుండా
కాపు రిజర్వేషన్ల పోరాట సమితి పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మేధావుల నుంచి తాము ఇప్పటికే గణనీయంగా సూచనలు,సలహాలు స్వీకరించామని ఇకపై సూచనలు, సలహాలతో కాలయాపన చేయకుండా ఆచరణ దిశగా అడుగులు వేయాలని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి తమ మేధావులు, క్రియాశీల కార్యకర్తలు, ఐటీ, న్యాయవాద రంగ ప్రముఖులకు పిలుపునిచ్చింది. బీసీ కమిషన్ చైర్మన్ మంజూనాధ్‌తో పాటు కమిషన్ సభ్యులు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నందున తమ జాతి సమాచారాన్ని అక్షర బద్ధం చేసి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది.
బీసీ కమిషన్‌కు సమర్పించాల్సిన నివేదికల తయారీకి రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీని నియమించనున్నట్టు ప్రకటించింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం- భవిష్యత్ కార్యాచరణపై గత రెండు మూడు నెలలుగా వివిధ వర్గాలను సంప్రదించిన అనంతరం తామీ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. ఈమేరకు పోరాట సమితి తరఫున ఎ.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.