డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో తీవ్రజాప్యాన్ని నిరసిస్తూ.. సోమవారం పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
విద్యార్థి సంఘాల ఆందోళన: ఉద్రిక్తత
Apr 10 2017 12:54 PM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో తీవ్రజాప్యాన్ని నిరసిస్తూ.. సోమవారం పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అప్పుడు ఇప్పుడు అంటూ నోటివికేషన్ విడుదలలో తీవ్ర జాప‍్యం చేస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సైఫాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Advertisement
Advertisement