'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది... | Star India group pick up 30% stake in MAA TV | Sakshi
Sakshi News home page

'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...

Feb 11 2015 12:19 PM | Updated on Sep 2 2017 9:09 PM

'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...

'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...

తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి స్టార్ గ్రూప్ ఎంటరైంది. మా టీవీకి, స్టార్ గ్రూప్ సంస్థ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్ : తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి స్టార్ ఇండియా గ్రూప్ ఎంటరైంది.  మా టీవీకి, స్టార్ గ్రూప్ సంస్థ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరింది. స్టార్ ఇండియా ఆపరేషన్స్లో మాటీవీ భాగం కానుంది.కొన్ని వాటాలను మాటీవీ...స్టార్ గ్రూప్కు విక్రయించింది. మాటీవీ మేనేజ్మెంట్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాటీవీతో ఒప్పంద వివరాలను సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాటీవీ భాగస్వాములు హీరోలు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టైఅప్తో ఆ లోటు తీరిందన్నారు.  అయితే బ్రాడ్కాస్ట్ బిజినెస్లో భాగస్వాములం మాత్రమేనని స్టార్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందని, ప్రమోటర్లు వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. ఇక నుంచి మా బ్రాండ్...స్టార్గా మారుతుందన్నారు. రెగ్యులేటర్ అనుమతులు రాగానే అమల్లోకి వస్తుందన్నారు. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement