breaking news
star group
-
జీ..ఎవరి చేజిక్కేనో..?
ముంబై : దేశీ మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెజెస్‌ను చేజిక్కించుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, అంతర్జాతీయ మీడియా దిగ్గజం ముర్ధోక్‌ల మధ్య పోరు నెలకొంది. జీ ఎంటర్టైన్మెంట్ను కైవసం చేసుకునేందుకు ఫేస్బుక్ సంకేతాలు పంపగా ముర్ధోక్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బ్లాక్‌స్టోన్‌లతో కలిసి అమెరికా కేబుల్ దిగ్గజం కామ్‌కాస్ట్ కన్సార్షియంగా ఏర్పడి జీ ఎంటర్టైన్మెంట్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ విలువను మదించే ప్రక్రియనూ కామ్‌కాస్ట్ కన్సార్షియం చేపట్టిందన్న ప్రచారం సాగుతోంది. సీఎన్‌బీసీ, యూనివర్సల్ పిక్చర్స్ వంటి గ్లోబల్ మీడియా బ్రాండ్లను కలిగిఉన్న కామ్‌కాస్ట్ కన్సార్షియం భారత మీడియాలో మెరుగైన మార్కెట్ వాటా కోసం జీ ఎంటర్టైన్మెంట్ను కైవసం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. మరోవైపు జీ ప్రమోటర్లు వ్యాపార నిర్వహణలో తాము చురుకైన పాత్రను కొనసాగించేందుకు మొగ్గుచూపుతుండగా కొనుగోలుదారులు మాత్రం కంపెనీపై పూర్తి నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర ప్రకారం ప్రమోటర్ల వాటాలో సగం విలువ రూ 6,603 కోట్లుగా అంచనా వేస్తుండగా మదింపు విలువను మరింత పెంచాలని జీ ప్రమోటర్లు పట్టుబడుతున్నట్టు తెలిసింది. జీ ఎంటర్టైన్మెంట్ విక్రయ ఒప్పందం ఓ కొలిక్కివస్తే రుణభారంతో సతమతమవుతున్న ప్రమోటింగ్ కంపెనీ ఎస్సెల్ గ్రూప్‌కు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. -
'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...
-
'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...
హైదరాబాద్ : తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి స్టార్ ఇండియా గ్రూప్ ఎంటరైంది. మా టీవీకి, స్టార్ గ్రూప్ సంస్థ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరింది. స్టార్ ఇండియా ఆపరేషన్స్‌లో మాటీవీ భాగం కానుంది.కొన్ని వాటాలను మాటీవీ...స్టార్ గ్రూప్‌కు విక్రయించింది. మాటీవీ మేనేజ్మెంట్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాటీవీతో ఒప్పంద వివరాలను సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాటీవీ భాగస్వాములు హీరోలు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టైఅప్‌తో ఆ లోటు తీరిందన్నారు. అయితే బ్రాడ్కాస్ట్ బిజినెస్‌లో భాగస్వాములం మాత్రమేనని స్టార్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందని, ప్రమోటర్లు వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. ఇక నుంచి మా బ్రాండ్...స్టార్‌గా మారుతుందన్నారు. రెగ్యులేటర్ అనుమతులు రాగానే అమల్లోకి వస్తుందన్నారు. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.