శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్ | SpiceJet emergency landing in Shamsabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్

Jul 7 2016 11:14 PM | Updated on Aug 20 2018 2:31 PM

శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలోని ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో పెలైట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

సదరు ప్రయాణికుడిని వెంటనే ఎయిర్‌పోర్టులోని అపొలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆప్రయాణికుడు చనిపోయాడు. అతడిని పంజాబ్‌కు చెందిన భగత్‌సుభేష్‌గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement