కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా | Sewerage labour protests at GHMC circle office in Boinapally | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

Aug 7 2015 10:45 AM | Updated on Sep 3 2017 6:59 AM

కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

పారిశుధ్య కార్మికునిపై ఓ వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ... కంటోన్మెంట్లోని కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు.

హైదరాబాద్ : పారిశుధ్య కార్మికునిపై ఓ వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ... కంటోన్మెంట్లోని కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గురువారం రోడ్డుపై చెత్తవేస్తున్న వ్యక్తిని పారిశుధ్య కార్మికుడు రమేష్ అడ్డుకున్నాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో రమేష్పై సదరు వ్యక్తి దాడి చేశాడు.

దాంతో కలత చెందిన పారిశుధ్య కార్మికుడు ఈ విషయాన్ని తోటి కార్మికులతో చెప్పాడు. దాంతో వారు శుక్రవారం ధర్నాకు దిగారు. బోయినపల్లి పరిథిలోని ఐదు సర్కిళ్లకు చెందిన మొత్తం 750 మంది కార్మికులు విధులను బహిష్కరించి సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement