ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజన కోలుకుంటోంది.
పెద్దఅంబర్‌పేట్ వద్ద ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజన క్రమంగా కోలుకుంటోంది. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజనకు బుధవారం వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు కృత్రిమ శ్వాస అవసరం లేదని చెప్పారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తల్లి శ్రీదేవి ఆరోగ్యం కూడా మెరుగవుతోందని డాక్టర్లు వెల్లడించారు.