ఆర్మీ కల్నల్‌ ఇంట్లో దోపిడి | robbery in army officer's house at secunderabad | Sakshi
Sakshi News home page

ఆర్మీ కల్నల్‌ ఇంట్లో దోపిడి

Mar 4 2017 6:50 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఆర్మీ కల్నల్‌ ఇంట్లో దోపిడి - Sakshi

ఆర్మీ కల్నల్‌ ఇంట్లో దోపిడి

సికింద్రాబాద్‌లో నివసిస్తున‍్న ఆర్మీ కల్నల్‌ నయ‍్యర్‌ ఇంట‍్లో శనివారం భారీ దోపిడి జరిగింది.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో నివసిస్తున‍్న ఆర్మీ కల్నల్‌ నయ‍్యర్‌ ఇంట‍్లో శనివారం వేకువజామున భారీ చోరీ జరిగింది. కల్నల్‌ నయ‍్యర్‌ స‍్వంత పనిపై శుక్రవారం బెంగళూరు వెళ్ళాడు. ఆయన కుమారుడు ఇంట‍్లో ఉన్నాడు. అతనికి రేచీకటి ఉన‍్నందున ఇంటికి కాపలాగా ఇద‍్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు. అయితే శనివారం వేకువజామున ఒక సెక్యూరిటీ గార్డు లేని సమయంలో నలుగురు దుండగులు ఇంట‍్లోకి వచ్చి నయ‍్యర్‌ కుమారుడిని కత్తులతో బెదిరించి తాళ‍్లతో కట్టివేసి ఇంట‍్లోని ఒక కిలో బంగారు నగలు దోచుకెళ్ళారు.

చోరీ జరిగిన తర్వాత ఇంట‍్లో ఉండే నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ‍్యక‍్తం అవుతున్నాయి. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఇంటి బయట ఉన‍్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement