నేరాలలో సంబంధం ఉండి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నేరాలలో సంబంధం ఉండి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్‌ల నుంచి సమాచారం సేకరించి అర్హత కలిగిన ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఖైదీలను డివిజన్‌ల వారీగా విభజించి వారికి పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు. ఓటు వేసిన అనంతరం సీల్డ్ కవర్‌లో స్వీకరించి డివిజన్‌ల వారీగా భద్రపరుస్తారు. వీటిని ఆయా కౌంటింగ్ కేంద్రాలకు పంపి ఫిబ్రవరి 5న లెక్కిస్తారు.
కాగా ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు రాజేంద్రనగర్ ఇన్‌చార్జి ఉపకమిషనర్ దశరథ్ పోలీస్‌స్టేషన్‌ల నుండి ఖైదీల వివరాలను సేకరించారు. మొత్తం ఇక్కడి ఐదు డివిజన్‌లలో 15 మంది జైలులో ఉన్నారు. కాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్‌లలో 53 మంది సర్వీసు ఓటర్లను కూడా అధికారులు గుర్తించారు. వారి చిరునామా అనుగుణంగా పోస్టల్ ద్వారా సోమవారం బ్యాలెట్ పేపర్లను పంపించారు. - రాజేంద్రనగర్