‘మియాపూర్‌’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది | Revant Reddy and L. Ramana on Miyapur land scam | Sakshi
Sakshi News home page

‘మియాపూర్‌’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది

Jun 4 2017 12:52 AM | Updated on Sep 5 2017 12:44 PM

‘మియాపూర్‌’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది

‘మియాపూర్‌’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది

శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ భూ కుంభ కోణం సూత్రధారులకు రాష్ట్ర ప్రభు త్వం కొమ్ముకాస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

టీటీడీపీ నేతలు రేవంత్, ఎల్‌.రమణ
సాక్షి, హైదరాబాద్‌: శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ భూ కుంభ కోణం సూత్రధారులకు రాష్ట్ర ప్రభు త్వం కొమ్ముకాస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

భూములు రిజిస్ట్రే షన్‌ చేసుకున్న సంస్థ యజమాని బంధువులు సీఎం కార్యాలయంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోందని, అదేవిధంగా కొందరు ప్రముఖ నేతలు సైతం దీని వెనుక ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి అధికారులను సస్పెండ్‌ చేసి ప్రభుత్వం చేతులు దులుపు కుంటోందన్నారు. ఈ మేరకు సచివాలయంలోని సీ బ్లాక్‌ ఎదుట టీటీడీపీ నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమార్కు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement