రామరాజు పాస్‌పోర్ట్ ఇచ్చేయండి | Rama Raju passport give it away! | Sakshi
Sakshi News home page

రామరాజు పాస్‌పోర్ట్ ఇచ్చేయండి

Sep 16 2016 6:20 AM | Updated on Aug 31 2018 8:53 PM

సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్ పూర్వ ఎండీ బైర్రాజు రామరాజు పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

సత్యం కంప్యూటర్స్ కేసులో అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్ పూర్వ ఎండీ బైర్రాజు రామరాజు పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తన పాస్‌పోర్టును తిరిగిచ్చేలా ఆదేశించాలని కోరుతూ రామరాజు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. సత్యం కేసులో అప్పీల్‌పై విచారణ జరుగుతున్న కోర్టుకు డాక్యుమెంట్లను పంపాల్సి ఉన్నందున పాస్‌పోర్టును తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని కింది కోర్టు చెప్పడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. విచారణ పత్రాల్లో పాస్‌పోర్ట్ లేనప్పుడు ఇచ్చేందుకు అభ్యంతరం ఏముంటుందన్న న్యాయమూర్తి, దాన్ని రామరాజుకు ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement