అధ్వానంగా రబీ | rabhi season is also not better | Sakshi
Sakshi News home page

అధ్వానంగా రబీ

Nov 27 2015 3:05 AM | Updated on Sep 3 2017 1:04 PM

రాష్ట్రంలో రబీ పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మొత్తం పంటల సాగు 31.32 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో కేవలం 6.80 లక్షల ఎకరాల్లోనే

16 శాతానికి మించని ఆహారధాన్యాల సాగు
వ్యవసాయశాఖ తాజా నివేదిక

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మొత్తం పంటల సాగు 31.32 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో కేవలం 6.80 లక్షల ఎకరాల్లోనే (22 శాతం) జరిగినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదికలో పొందుపరిచింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా 3.92 లక్షల ఎకరాల్లోనే (16 శాతం) సాగైనట్లు పేర్కొంది.

ఇక 16.12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2 వేల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఈనేపథ్యంలో రబీలో ఆహారపంటల సాగు మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారధాన్యాల కొరత వెంటాడనుంది. ఇదిలా ఉండగా రబీలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 78 శాతం వర్షపాతం కొరత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 95 శాతం కొరత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement