వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయానికి శాఖల తరలింపు చివరి ముహూర్తం మరోసారి వాయిదా పడింది.
వచ్చే నెల 4 -10వ తేదీ మధ్యలో ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయానికి శాఖల తరలింపు చివరి ముహూర్తం మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన మేరకు ఈ నెల 29న సచివాలయ మిగతా శాఖలన్నీ ఉద్యోగులు, అధికారులతో సహా హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆషాడ మాసంలో వెలగపూడి సచివాలయానికి వెళ్లేందుకు మంత్రులు ససేమిరా అన్నారు.
దీనికితోడు అక్కడ కూర్చుని పనిచేసే వాతావరణమే లేకుండా వెళ్లి వెనక్కు వచ్చేయడం ప్రహసనంగా మారుతోందని, ఇప్పటికే రెండు ముహూర్తాల్లో అదే పరిస్థితి అయ్యిందనే భావనను అధికారులు వ్యక్తం చేశారు. కొన్ని రోజుల ఆలస్యం అయినా పరవాలేదని, హడావిడిగా వెళ్లి అభాసుపాలవడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ మధ్యలో మళ్లీ ముహూర్తాలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది.