పీసీసీ కార్యవర్గ కూర్పు బాధ్యత హైకమాండ్దేనని టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు బాగా లేదని వచ్చిన వార్తలపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు.
	హైదరాబాద్: పీసీసీ కార్యవర్గ కూర్పు బాధ్యత హైకమాండ్దేనని టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు బాగా లేదని వచ్చిన వార్తలపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసుల వేధింపులు సరికావని ఉత్తమ్ అన్నారు.
	
	స్కాలర్ షిఫ్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ లకు సంబంధించిన రూ.3,600 కోట్లు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఈ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో, పీజీ స్టాఫ్ను భర్తీ చేయడం లేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
