హనుమాన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన సీపీ | Sakshi
Sakshi News home page

హనుమాన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

Published Thu, Apr 21 2016 11:12 AM

police commissioner, ghmc commissioner visits gowliguda

హైదరాబాద్ : గౌలిగూడలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా వందల కెమెరాలతో నిరంతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి  వెల్లడించారు. గురువారం గౌలిగూడలో రేపు జరగనున్న హనుమాన్ జయంతి ఊరేగింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డితోపాటు మహేందర్రెడ్డి  పరిశీలించారు.

అనంతరం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మహేందర్రెడ్డి వివరించారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement