
మేలో పీసీబీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్షలు
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో పోస్టుల భర్తీకి మేలో ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ఆధారిత) పరీక్షలను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో పోస్టుల భర్తీకి మేలో ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ఆధారిత) పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. 26 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (ఏఈఈ), 24 అనలిస్ట్ గ్రేడ్–2, 4 స్టెనో కమ్ టైపిస్టు, 3 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, 5 జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ మార్చి వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఈ పోస్టులకు దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు.
అనలిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు మే 7వ తేదీన, ఏఈఈ పోస్టులకు 14న, స్టెనో కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 13న ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. టెక్నీషియన్ పోస్టులకు 13వ తేదీ ఉదయాన్నే పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించింది.