‘పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దు’ | Delhi Air Quality Very Poor After Night Of Fireworks On Diwali, Check More Details Inside | Sakshi
Sakshi News home page

Air Pollution In Delhi: ‘పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దు’

Oct 21 2025 8:37 AM | Updated on Oct 21 2025 11:11 AM

Delhi Air Quality Very Poor After Night Of Fireworks On Diwali

ఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్‌ను తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం (అక్టోబర్‌ 21, మంగళవారం) 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఊపిరి ఆడక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని  ప్రజలకు అధికారులు సూచించారు. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. 38 ఎయిర్‌ మానిటరింగ్‌స్టేషన్లలో 36 రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. వజీర్‌పూర్‌ 423, ద్వారకా 417, అశోక్‌ విహార్‌ 404, ఆనంద్‌ విహార్‌లో 404గా AQI నమోదైంది.

గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగింది. నిన్న సాయంత్రం (సోమవారం) సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా 'వెరీ పూర్' కేటగిరీలో నమోదైంది. బాణాసంచా మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది.

పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అక్టోబర్ 15న సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది.


గత ఆరు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలో  కొనసాగుతోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ చెబుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement