పంట కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు | Sakshi
Sakshi News home page

పంట కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు

Published Sat, Feb 3 2018 1:23 AM

Payments instantly for crop purchase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంది పంటను కొనుగోలు చేసిన తక్షణమే రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కందితో పాటు ఇతర పంటల కనీస మద్దతు ధరకు కొనుగోలుపై మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైతుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఇప్పటివరకు రైతుల నుంచి సుమారు 9.87 లక్షల క్వింటాళ్ల కందిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి రూ.21 కోట్లు వెంటనే విడుదల చేయాలని నాఫెడ్‌ను ఆదేశించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement