గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద | Paripoornananda swamy to make puja for goraksha diwas | Sakshi
Sakshi News home page

గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద

Dec 10 2015 9:19 AM | Updated on Sep 3 2017 1:47 PM

గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద

గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ భాగ్యనగర్‌ గోశాలలో గురువారం శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గో పూజను నిర్వహించారు.

హైదరాబాద్‌: లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ భాగ్యనగర్‌ గోశాలలో గురువారం శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గో పూజను నిర్వహించారు. గోవులను పూజించడం సనాతన ధర్మమని...బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన రావడం దౌర్భాగ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి డిసెంబర్ 10వ తేదీని గోరక్ష దివస్గా నిర్వహించాలని స్వామిజీ సూచించారు.

గో ఆధారిత వ్యవసాయంతోనే రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చునని... తెలుగు రాష్ట్రాల్లో గోరక్ష క్రాంతి ఫథకం కింద రైతులకు ఆవులను పంపిణీ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆవును ప్రజలు పశువుగా, జంతువుగా చూడకూడదని... ఆవు పాలు తాగితే మంచిదని...దీనిపై విస్తృత ప్రచారం జరగాలని స్వామిజీ సూచించారు. గోవధ అనే మాట పలకడమే పెద్ద నేరమని, దానికి 6 నెలల శిక్ష కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చట్టాలను కఠినంగా అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామిజీ  ప్రభుత్వాలను కోరారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement