అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.. | Palvayi govardan Reddy fired on kcr | Sakshi
Sakshi News home page

అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు..

Oct 8 2016 3:19 AM | Updated on Mar 22 2019 6:13 PM

అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.. - Sakshi

అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు..

తెలంగాణ సంక్షేమాన్ని విస్మరిస్తున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేవలం హంగు, ఆర్భాటాలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని...

కేసీఆర్‌పై ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంక్షేమాన్ని విస్మరిస్తున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేవలం హంగు, ఆర్భాటాలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఇక్కడి ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమి, పింఛన్ల పెంపు హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement