'ఆర్టీసీ విలీనంపై కేబినెట్లో చర్చిస్తా' | P Mahender Reddy takes charge as Telangana Transport Minister | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీ విలీనంపై కేబినెట్లో చర్చిస్తా'

Jun 8 2014 12:30 PM | Updated on Sep 2 2017 8:30 AM

'ఆర్టీసీ విలీనంపై కేబినెట్లో చర్చిస్తా'

'ఆర్టీసీ విలీనంపై కేబినెట్లో చర్చిస్తా'

తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి మహీందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి మహీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో మహీందర్ రెడ్డి రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని బస్‌ డిపోలను ఆధునీకరిస్తామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కేబినెట్‌లో చర్చిస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తాని వెల్లడించారు.

 

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే బస్సు ఛార్జీలు తక్కువుగా ఉన్నాయి మహీందర్ రెడ్డి గుర్తు చేశారు. అయినా ఆర్టీసీ ఛార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ల కొత్తకోట మండలం పాలెం సమీపంలో గతేడాది వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయిందిని... ఆటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మహీందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement