‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’ | our sister sirish didnt committed suicide | Sakshi
Sakshi News home page

‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’

Jun 16 2017 12:07 PM | Updated on Sep 5 2017 1:47 PM

‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’

‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’

తమ చెల్లి శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి అన్నారు. శిరీషది ముమ్మాటికి హత్యే అని ఆమె చెప్పారు.

నల్లగొండ: తమ చెల్లి శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి అన్నారు. శిరీషది ముమ్మాటికి హత్యే అని ఆమె చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించాలని అస్సలు వదిలిపెట్టొద్దని అన్నారు. హత్య వెనుక రాజీవ్‌, శ్రవణ్‌‌, తేజస్వీ ప్రమేయం ఉందని అన్నారు. కావాలనే హత్యను ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరి చాలా ధైర్యంగల యువతి అని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.

ఈ కేసులో తనకు పలు అనుమానాలున్నాయని, ఇప్పటి వరకు పోలీసులు తేజస్వీని ఎందుకు చూపిండం లేదని ప్రశ్నించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్‌ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్‌ శిరీష మృతి కేసును ఛేదించినట్లుగా పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసుపై వివరాలను హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వెల్లడిస్తారని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో శిరీష సోదరి భార్గవి స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement