అధికారులు కావలెను | Officials wanted | Sakshi
Sakshi News home page

అధికారులు కావలెను

Mar 6 2016 12:46 AM | Updated on Sep 3 2017 7:04 PM

అధికారులు కావలెను

అధికారులు కావలెను

ప్రభుత్వ పనులు సకాలంలో జరగాలన్నా, ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారం కావాలన్నా అధికారులు ఉండాలి.

జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీ    
ఇన్‌చార్జీల పాలనలో పలుశాఖలు  
మిగతా శాఖల్లో 213 సిబ్బంది

 
సిటీ బ్యూరో: ప్రభుత్వ పనులు సకాలంలో జరగాలన్నా, ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారం కావాలన్నా అధికారులు ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎందరున్నా అధికారుల చేతుల మీదుగానే సమస్యలు ఓ కొలిక్కి వస్తా యి. ప్రభుత్వ పాలనలో అధికారుల పాత్ర కీలకం. అయితే హైదరాబాద్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. ఖాళీల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇన్‌చార్జీలు ఉండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారు. వివిధ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది శాఖలకు జిల్లా స్థాయి అధికారులు లేరు. ఈ కారణంగా పనుల పురోగతికి బ్రేక్ పడుతోంది. 
 
ఖాళీగా ఉన్న పోస్టులివే

జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ,  వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ (డీబీసీడబ్ల్యూఓ) డీడీ, ఆర్‌వీఎం పీడీ,  హార్టికల్చర్ ఏడీ, హైదరాబాద్  ఎస్టేట్ అధికారి, గృహనిర్మాణ శాఖ పీడీ, ఎన్‌సీఎల్‌డీ పీడీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, వయోజన విద్య డీడీ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

రెవెన్యూ శాఖలో కూడా ఖాళీలు భారీగా ఉన్నాయి. జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 591 మంది ఉద్యోగులకు గానూ 506 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు తహసీల్దార్లు, ఎనిమిది మంది డీటీలు, పన్నెండు మంది వీఆర్‌ఓలు, 13 మంది వీఆర్‌ఏలు, 20 మంది టైపిస్టులతో సహా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లు, వాచ్‌మెన్లు, అటెండర్లు, డైవర్లు మొత్తం కలిపి 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉద్యోగులు, సిబ్బంది కలిసి మొత్తంగా 92 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డీఎస్‌డబ్ల్యూఓ పోస్టులు రెండు,  ఏఎస్‌డబ్ల్యూఓ పోస్టులు 13, వార్డెన్ పోస్టులు 22, కామాటీలు, వాచ్‌మెన్లు, వంటవారికి చెందిన పోస్టులు 55 ఖాళీగా ఉన్నాయి.

ప్రస్తుతమున్న సిబ్బందిలో కూడా 120 మంది ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్నారు. ఆర్‌వీఎంలో 24 ఇంజనీర్లకు గానూ 12 మంది మాత్రమే ఉండగా 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐసీడీఎస్‌లో సీడీపీఓతోపాటు అంగన్‌వాడీ వర్కర్స్, ఆయాల పోస్టు లు మొత్తం 10 ఖాళీగా ఉన్నాయి. ల్యాండ్ సర్వే విభాగంలో 16 మంది సర్వేయర్లకు గాను 9 మంది మాత్రమే ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో కూడా ఉపాధ్యాయ పోస్టులతోపాటు పలు కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement