బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ప్రారంభం | OBC overseas scholarship scheme has started | Sakshi
Sakshi News home page

బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ప్రారంభం

Oct 10 2016 12:10 AM | Updated on Sep 4 2017 4:48 PM

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.

సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సంతకం చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం అమలవుతోంది.
 
 మొదటిసారిగా బీసీల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం నిర్ణయించారు. దీని ద్వారా విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనుంది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.60 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement