
'నాలుగు నెలల్లో నంబర్ ప్లేట్లు మార్చుకోవాలి'
తెలంగాణలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్ల మార్పునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల్లోగా అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్ల మార్పునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల్లోగా అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది.
నాలుగు అంకెల నంబర్ యథావిథిగా ఉంటూనే నంబర్ ప్లేట్ మారనుంది. ఏపీ స్థానంలో టీఎస్తోపాటు జిల్లా కోడ్లు మారనున్నాయి. ఆన్ లైన్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మార్చుకునే సదుపాయం ఉంటుంది. ఈ మేరకు గురువారం తెలంగాణ రవాణాశాఖగురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.