'బెదిరింపులకు భయపడేది లేదు' | No scare to warning call from Unknown persons | Sakshi
Sakshi News home page

'బెదిరింపులకు భయపడేది లేదు'

Dec 12 2015 12:07 PM | Updated on Aug 16 2018 3:23 PM

'బెదిరింపులకు భయపడేది లేదు' - Sakshi

'బెదిరింపులకు భయపడేది లేదు'

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే తనను చంపుతామని బెదిరిస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

హైదరాబాద్‌: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే తనను చంపుతామని బెదిరిస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని చెప్పారు.

కొమరయ్య అనే రైతు అడిగితే ఆయనను జైల్లో పెట్టారన్నారు. నిన్నసీఎం కేసీఆర్‌, పంచాయతీ రాజ్‌ శాఖ, ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్‌లపై మాట్లాడినందుకే తనను చంపుతామని కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదుచేస్తే ఏ ఒక్క పోలీస్‌ మమ్మల్ని అడగలేదని విమర్శించారు. దీన్నిబట్టి బెదిరింపు కాల్స్‌ వెనుక ఉన్నది ఎవరో ప్రజలే అర్థం చేసుకోవాలని షబ్బీర్‌ అలీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement