మళ్లీ గవర్నర్‌గా నరసింహన్‌! | Narasimhan to continue as governor of Telugu states | Sakshi
Sakshi News home page

మళ్లీ గవర్నర్‌గా నరసింహన్‌!

May 3 2017 12:47 AM | Updated on Sep 5 2017 10:08 AM

మళ్లీ గవర్నర్‌గా నరసింహన్‌!

మళ్లీ గవర్నర్‌గా నరసింహన్‌!

గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా కొనసా గనున్నారు.

సమాచారమిచ్చిన కేంద్ర హోంమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా కొనసా గనున్నారు. తాత్కా లికంగా ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. నరసింహన్‌ ప్రస్తుత పదవీకాలం మంగళవా రంతో ముగియడంతో.. ఆయనను కొనసాగి స్తారా, కొత్త గవర్నర్‌ను నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రం 4.35 గంటలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గవర్నర్‌ నరసింహన్‌తో ఫోన్‌లో మాట్లాడి.. ఇరు రాష్ట్రాల గవర్నర్‌గా తిరిగి కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందిం చినట్లు తెలిసింది.

అనంతరం కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్‌ మహర్షి సైతం నరసింహన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. దీనిపై రాష్ట్రపతి భవన్‌కు సమాచారం పంపించి అధికా రికంగా ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర çహోం శాఖ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కొద్దినెలల పాటు గవర్నర్‌గా కొనసాగిస్తారా, లేక మరో విడత మొత్తంగా పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న దానిపై ఉత్తర్వులు వెలువడిన అనంతరం స్పష్టత రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement