
అవినీతిని అడ్డుకోవడమే తప్పా?: నాగం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అవినీతిని అడ్డుకుంటున్నందుకు తనపై దాడులు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, అవినీతిని అడ్డుకోవడమే తప్పా? అని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అవినీతిని అడ్డుకుంటున్నందుకు తనపై దాడులు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, అవినీతిని అడ్డుకోవడమే తప్పా? అని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు తాను వ్యతిరేకినంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు పాల్పడుతున్న అవినీతిపై మాత్రమే తాను కోర్టుకు వెళ్లానని చెప్పారు. కోర్టులో వాస్తవాలు బయటపడితే కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలు దాటే వరకు ప్రజలే తరిమికొడతారని నాగం హెచ్చరించారు.