కిట్టాపూర్‌ వద్ద సీసీటీవీకి.. | muthoot thieves vehicle found at karnataka kittapur | Sakshi
Sakshi News home page

కిట్టాపూర్‌ వద్ద సీసీటీవీకి..

Jan 1 2017 3:52 AM | Updated on Oct 30 2018 5:50 PM

కిట్టాపూర్‌ వద్ద సీసీటీవీకి.. - Sakshi

కిట్టాపూర్‌ వద్ద సీసీటీవీకి..

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ రాంచంద్రపురం ఠాణా పరిధిలో ‘ముత్తూట్‌ భారీ దోపిడీ’కి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

కర్ణాటకలోని ఈ ప్రాంతంలోనే సీసీటీవీ ఫుటేజీకి
  చిక్కిన ‘ముత్తూట్‌’దొంగల కారు


సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ రాంచంద్రపురం ఠాణా పరిధిలో ‘ముత్తూట్‌ భారీ దోపిడీ’కి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే గ్రేహౌండ్స్, టాక్టికల్‌ వింగ్‌లతో కూడిన 16 బృందాలు కర్ణాటకను జల్లెడ పడుతున్నాయి.

(చదవండి : ‘ముత్తూట్‌’లో ఘరానా దోపిడీ)

నిందితులు వెళ్లిన ఏపీ23ఎం 3107 నంబర్‌ కారు కర్ణాటకలోని సెడామ్‌ నుంచి గుల్బర్గా మధ్యలో కిట్టాపూర్‌ వద్ద  చివరిసారిగా సీసీ టీవీ ఫుటేజీకి చిక్కింది. దీంతో నిందితులు కారును ఆ ప్రాంతంలో వదిలేసి కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లి ఉంటారన్న అనుమానంతో కొన్ని బృందాలు అక్కడ తనిఖీ చేస్తున్నాయి. సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కిట్టాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులతో మాట్లాడారు. వారికి నిందితుల ఊహాచిత్రాలను కూడా పంపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement