చందానగర్లో దారుణ హత్య | murder in chanda nagar for old women jewellary | Sakshi
Sakshi News home page

చందానగర్లో దారుణ హత్య

Sep 9 2016 7:40 PM | Updated on Sep 4 2017 12:49 PM

చందానగర్లో దారుణ హత్య

చందానగర్లో దారుణ హత్య

చందానగర్లో దారుణ హత్య జరిగింది. అక్కడి లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఇంటి యజమానిని పనిమనిషి హత్య చేసింది.

హైదరాబాద్: చందానగర్లో దారుణ హత్య జరిగింది. అక్కడి లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఇంటి యజమానిని పనిమనిషి హత్య చేసింది. నగలకోసమే ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఉమాదేవి(65) అనే వృద్ధురాలు ఉంటోంది.

ఆ ఇంట్లో పక్కనే మరో ఇంట్లో ఉంటున్న వసుంధర అనే మహిళ పనిమనిషిగా చేస్తోంది. ఆ వృద్ధురాలి నగలపై కన్నేసిన ఆమె ఉమాదేవీని కత్తితో పొడిచి తలుపులు వేసుకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిందితురాలు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పనిమనిషిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement