టపాసుల దుకాణం ఏర్పాటు విషయంలో గొడవకు దిగిన ఘటనలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
కుత్బుల్లాపూర్: టపాసుల దుకాణం ఏర్పాటు విషయంలో గొడవకు దిగిన ఘటనలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదిన చింతల్‌లో వివాదాస్పద స్థలంలో టపాసుల దుకాణం ఏర్పాటు చేయగా మాజీ డీసీసీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ తనయుడు విశాల్‌తో ఎమ్మెల్యే వివేకానంద్ గొడవకు దిగారు.
స్వయాన వరసకు అన్నదమ్ములై విశాల్, వివేకానంద్లు పొట్లాడుకోవడం చర్చానీయంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం ఎమ్మెల్యే వివేకానంద్‌ను అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌పై విడుదల చేశారు. తదుపరి విచారణ ఉంటుందని జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు.


