breaking news
Vivekanand
-
Vivekanand: వదిలే ప్రసక్తి లేదు తీర్పుపై న్యాయపోరాటం చేస్తాం
-
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అరెస్టు.. విడుదల
కుత్బుల్లాపూర్: టపాసుల దుకాణం ఏర్పాటు విషయంలో గొడవకు దిగిన ఘటనలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదిన చింతల్లో వివాదాస్పద స్థలంలో టపాసుల దుకాణం ఏర్పాటు చేయగా మాజీ డీసీసీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ తనయుడు విశాల్‌తో ఎమ్మెల్యే వివేకానంద్ గొడవకు దిగారు. స్వయాన వరసకు అన్నదమ్ములై విశాల్, వివేకానంద్‌లు పొట్లాడుకోవడం చర్చానీయంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం ఎమ్మెల్యే వివేకానంద్‌ను అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌పై విడుదల చేశారు. తదుపరి విచారణ ఉంటుందని జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే వివేకానంద్‌కు అరుదైన గౌరవం
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌ను పూణేకు చెందిన భారతీయ విద్యార్థి పార్లమెంట్ సంస్థ సన్మానానికి ఎంపిక చేసింది. 2014 సంవత్సరానికి గాను ఆదర్శ యువ శాసన సభ్యులకు దక్కే ఈ సత్కారానికి వివేకానంద్‌ను ఎంపికచేశారు. మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ టి.ఎన్. శేషన్, డాక్టర్ మషేల్కర్, తుషార్ ఏ గాంధీ, రాహుల్ వి కరద్ వంటి ప్రముఖుల నేతృత్వంలో భారతీయ విద్యార్థి పార్లమెంట్ సంస్థ నడుస్తోంది. ఈ సంస్థ దేశంలో చురుకైన యువ ఎమ్మెల్యేలను గుర్తించి గత కొన్నేళ్లుగా సత్కరిస్తోంది. ఈనెల 10న పూణేలోని ఎంఐటీ క్యాంపస్‌లో నిర్వహించే వేడుకల్లో వివేకానంద్‌ను సన్మానించనున్నారు. మొత్తం 28 రాష్ట్రాల్లోని 450 విశ్వ విద్యాలయాలకు చెందిన 12 వేల మంది సామాజిక, రాజకీయ రంగాల్లో ఉత్సాహ వంతులైన విద్యార్థులను ఉద్దేశించి వివేకానంద్ ప్రసగించనున్నారు.


