ఎమ్మెల్యే వివేకానంద్‌కు అరుదైన గౌరవం | MLA Vivekanand is a rare honor | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వివేకానంద్‌కు అరుదైన గౌరవం

Jan 8 2015 12:02 AM | Updated on Sep 2 2017 7:21 PM

ఎమ్మెల్యే వివేకానంద్‌కు అరుదైన గౌరవం

ఎమ్మెల్యే వివేకానంద్‌కు అరుదైన గౌరవం

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌ను పూణేకు చెందిన భారతీయ విద్యార్థి పార్లమెంట్ సంస్థ సన్మానానికి ఎంపిక చేసింది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌ను పూణేకు చెందిన భారతీయ విద్యార్థి పార్లమెంట్ సంస్థ సన్మానానికి ఎంపిక చేసింది. 2014 సంవత్సరానికి గాను ఆదర్శ యువ శాసన సభ్యులకు దక్కే ఈ సత్కారానికి వివేకానంద్‌ను ఎంపికచేశారు. మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ టి.ఎన్. శేషన్, డాక్టర్ మషేల్కర్, తుషార్ ఏ గాంధీ, రాహుల్ వి కరద్ వంటి ప్రముఖుల నేతృత్వంలో భారతీయ విద్యార్థి పార్లమెంట్ సంస్థ నడుస్తోంది.

ఈ సంస్థ దేశంలో చురుకైన యువ ఎమ్మెల్యేలను గుర్తించి గత కొన్నేళ్లుగా సత్కరిస్తోంది. ఈనెల 10న పూణేలోని ఎంఐటీ క్యాంపస్‌లో నిర్వహించే వేడుకల్లో వివేకానంద్‌ను సన్మానించనున్నారు. మొత్తం 28 రాష్ట్రాల్లోని 450 విశ్వ విద్యాలయాలకు చెందిన 12 వేల మంది సామాజిక, రాజకీయ రంగాల్లో ఉత్సాహ వంతులైన విద్యార్థులను ఉద్దేశించి వివేకానంద్ ప్రసగించనున్నారు.
 
 

Advertisement
Advertisement