అర్ధరాత్రి..సెక్యూరిటీ లేకుండా.. బుల్లెట్ పై మంత్రి | Minister Padma Rao takes a jolly ride on Panjagutta roads | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి..సెక్యూరిటీ లేకుండా.. బుల్లెట్ పై మంత్రి

Aug 25 2014 5:28 PM | Updated on Sep 2 2017 12:26 PM

అర్ధరాత్రి..సెక్యూరిటీ లేకుండా.. బుల్లెట్ పై మంత్రి

అర్ధరాత్రి..సెక్యూరిటీ లేకుండా.. బుల్లెట్ పై మంత్రి

ఓ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా.. చిన్న చిన్న కోర్కెలు వెంటాడుతూనే ఉంటాయి

హైదరాబాద్: ఓ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా.. చిన్న చిన్న కోర్కెలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కోర్కెలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ను వెంటాడాయో ఏమో.. అర్ధరాత్రి సెక్యూరిటీని వదిలేసి హైదరాబాద్ లోని పంజాగుట్ట-సికింద్రాబాద్ రోడ్డుపై రయ్ రయ్ మంటూ రాయల్ ఎన్ ఫీల్డ్ పై షికారు చేశారు. 
 
మంత్రి అయ్యాక మీటింగ్, సందర్శకులతో బిజీగా ఉండే పద్మారావు ఆటవిడుపు కోసం తన కార్యకర్తలతో కలిసి రోడ్లపై ఎంజాయ్ చేశారు. తన అభిమానులు, కార్యకర్తల కోరికను తొలుత సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే చివరికి రాయల్ ఎన్ ఫీల్డ్ పై రైడ్ చేస్తూ.. తన కార్యకర్తను వెనుక కూచోపెట్టుకుని ఫ్లై ఓవర్లపై పద్మారావు ఎంజాయ్ రైడ్ ముగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement