ప్రియురాలి ఒత్తిడి, విషం తాగిన వివాహితుడు | married man commits suicide by drinking poison in chilakalaguda | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఒత్తిడి, విషం తాగిన వివాహితుడు

May 14 2014 9:10 AM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రియురాలి ఒత్తిడి, విషం తాగిన వివాహితుడు - Sakshi

ప్రియురాలి ఒత్తిడి, విషం తాగిన వివాహితుడు

పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా..’ అంటు ప్రియురాలు పెట్టిన ఒత్తిడి భరించలేక ఆమె తెచ్చిన విషం తాగిన వివాహితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చిలకలగూడ : ‘పెళ్లి చేసుకుంటావా..  విషం తాగమంటావా..’ అంటు ప్రియురాలు పెట్టిన ఒత్తిడి భరించలేక ఆమె తెచ్చిన విషం తాగిన వివాహితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన పీఎల్‌వీ సత్యనారాయణ (35) ప్రైవేటు ఉద్యోగి. శ్రద్ధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు.

సత్యనారాయణ పనిచేస్తున్న కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్న జయతో పరిచయం ఏర్పడింది. ఇరువురు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. జయ తనను పెళ్లి చేసుకోవాలని సత్యనారాయణను ఒత్తిడి చేసేది. ఈ విషయమై పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి వచ్చిన జయ ‘పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా’ అంటు బెదిరించింది. భార్య శ్రద్ధ ఎదుటే ప్రియురాలు ఒత్తిడి చేయడం భరించలేని సత్యనారాయణ.. ఆమె తెచ్చిన విషం బాటిల్‌ను గుంజుకుని గొంతులో పోసుకున్నాడు. క్షణాల్లో నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

దీంతో భార్య శ్రద్ధ అతన్ని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సత్యనారాయణ మృతి చెందాడు. మృతుని సోదరుడు గోవిందరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement