
సీఎం కేసీఆర్ మోసాలను వదిలిపెట్టం: మర్రి
సీఎం కేసీఆర్ మోసాలను వదిలి పెట్టేదిలేద ని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు.
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మోసాలను వదిలి పెట్టేదిలేద ని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌నగర్‌లో పేదల ఇళ్లు ఖాళీ చేయించడంపై తాను వేసిన పిల్‌ను కోర్టు విచారణకు స్వీకరించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా హుస్సేన్‌సాగర్‌ను ఆనుకుని ఉన్న లుంబినీపార్కు స్థలంలో ఏడు అంతస్తుల భవనం ఎలా నిర్మిస్తారని శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఏదో పిచ్చి ఉందని, లేకుంటే ఇలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు రావన్నారు.