మంజీర ఒడ్డుకు భారీ మొసలి | Manjeera river To Large crocodile | Sakshi
Sakshi News home page

మంజీర ఒడ్డుకు భారీ మొసలి

Jul 6 2015 3:04 AM | Updated on Oct 9 2018 4:48 PM

మంజీర ఒడ్డుకు భారీ మొసలి - Sakshi

మంజీర ఒడ్డుకు భారీ మొసలి

మంజీర నది వట్టిపోవడంతో అందులోని మొసళ్లు ఒడ్డుకు వస్తున్నాయి.

మనూరు: మంజీర నది వట్టిపోవడంతో అందులోని మొసళ్లు ఒడ్డుకు వస్తున్నాయి. మెదక్ జిల్లా మనూరు మండలం షాపూర్ వద్ద ఆదివారం ఉదయం ఓ భారీ మొసలి చెరకు తోటలోకి వచ్చింది. దీని బరువు దాదాపు ఐదు క్వింటాళ్ల వరకు ఉండవచ్చని రైతులు తెలిపారు. మొసలి చెరకు తోటలోకి వచ్చిన విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా సాయంత్రం వరకు స్పందించలేదు. చేసేది లేక తోట యజమాని కాల్వల ద్వారా మొసలి వద్దకు నీటిని వదిలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement