‘అశ్లీలం’తో ఆటలు! | man arrested who sent porn videos | Sakshi
Sakshi News home page

‘అశ్లీలం’తో ఆటలు!

Oct 10 2015 8:47 AM | Updated on Oct 9 2018 5:39 PM

‘అశ్లీలం’తో ఆటలు! - Sakshi

‘అశ్లీలం’తో ఆటలు!

వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు, దృశ్యాలను పంపిస్తూ మహిళను వేధించిన ఓ ప్రబుద్ధుడిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

మహిళను వేధించిన వ్యక్తి కటకటాల్లోకి

 సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు, దృశ్యాలను పంపిస్తూ మహిళను వేధించిన ఓ ప్రబుద్ధుడిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్  టోలిచౌకి నివాసి మహ్మద్ ఇబ్రహీం మలక్‌పేటలో సెలూన్ నిర్వహిస్తున్నాడు. ఇతను తన సెలూన్‌కు వచ్చే కస్టమర్లతో పరిచయం పెంచుకొని వారి ఫోన్ నెంబర్లు తీసుకునే వాడు. వీటికి తన ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు, దృశ్యాలు పంపి ఆనందించేవాడు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ స్నేహితుడి ద్వారా టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహిళ నెంబర్ తీసుకున్నాడు. ఈ నెంబర్‌కు అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలు, వీడియోలు పంపడం ప్రారంభించాడు. ఆమె హెచ్చరించినా పట్టించుకోకుండా తన పంథా కొనసాగించాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు, మానసిక క్షోభకు గురైన బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్, షీ-టీమ్స్ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాయి.

Advertisement
 
Advertisement
Advertisement