ప్రేమ పేరిట వంచన | man arrested for making cheating lover | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరిట వంచన

May 21 2014 9:20 AM | Updated on Aug 20 2018 4:27 PM

ప్రేమ పేరిట వంచన - Sakshi

ప్రేమ పేరిట వంచన

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు.. చివరికి పెళ్లికి నిరాకరించాడో ప్రబుద్ధుడు.

హైదరాబాద్ : ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు.. చివరికి పెళ్లికి నిరాకరించాడో ప్రబుద్ధుడు. బాధిత యువతి, నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్ కృప కాంప్లెక్స్ వద్ద నివాసముండే ఓ యువతి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు చిక్కడపల్లికి చెందిన సీహెచ్ ప్రవీణ్(29)తో సంవత్సరం క్రితం ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది.

అప్పుడప్పుడు ఆ యువతి వద్ద ప్రవీణ్ డబ్బులు తీసుకునేవాడు. తీరా పెళ్లి చేసుకోమంటే మొహం చాటేసి, పెళ్లికి తన కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని తేల్చిచెప్పాడు. దీంతో బాధిత యువతి నెల రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు. కాగా ప్రవీణ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు న్యాయవాది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇద్దరి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారంలో యువతికి ప్రవీణ్ పంపించిన సుమారు 8556 మెసెజ్‌లు, మెయిల్స్ వివరాలు అందచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్‌ను అరెస్టు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement