ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు | lingareddy torture his sister in law to love him | Sakshi
Sakshi News home page

ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు

Oct 16 2015 10:44 PM | Updated on Nov 6 2018 4:10 PM

ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు - Sakshi

ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు

తనను ప్రేమించాలని మేన మరదలిని వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం హయత్‌నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హయత్‌నగర్: తనను ప్రేమించాలని మేన మరదలిని వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం హయత్‌నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ డివిజన్ లెక్చరర్స్‌కాలనీలో నివసించే కేతుల జంగారెడ్డి అశ్విని(18)ను వరుసకు మేనబావ అయిన రాఘవేంద్రకాలనీలో నివసించే లింగారెడ్డి గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలు పెట్టాడు.

దీంతో విసుగు చెందిన అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అశ్విని తండ్రి, ఆమె బంధువులు లింగారెడ్డిపై దాడి చేయడంతో అతని తలకు గాయమైంది. దీంతో అశ్విని తండ్రి, అతని బంధువులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement