breaking news
love torture
-
ప్రేమించలేదని.. కాల్‌గర్ల్‌గా ప్రచారం!
విజయవాడ: ఓ జూలాయి కుర్రాడు అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఆమె పేరిట ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. ఆమె ఫొటోలు, ఫోన్ నంబర్లు పెట్టి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేశాడు. ఈ దుర్మార్గమైన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయితో పవన్‌కుమార్ అనే యువకుడు మొదట పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో పలు కథలు చెప్పి, సానుభూతి పొందేందుకు ప్రయత్నించాడు. అయినా ఆమె కాదనడంతో అతనిలో ఉన్మాదం మరింత పెరిగిపోయి.. పలుసార్లు ఫోన్‌చేసి బెదిరించాడు. ఆ తర్వాత ఫేస్బుక్లో ఆమె ఫొటోలు, ఫోన్‌నంబర్లు పెట్టి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేశాడు. తనకు, తన కుటుంబసభ్యులకు అభ్యంతరకరమైన ఫోన్లు వస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గతంలోనూ అతడిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా.. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. తాజా వేధింపుల నేపథ్యంలో నిందితుడిపై నిర్భయ కేసును నమోదుచేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిలపై ఆకతాయిలు ప్రేట్రేగిపోతూ.. సోషల్ మీడియాలోనూ వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. -
ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు
హయత్‌నగర్: తనను ప్రేమించాలని మేన మరదలిని వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం హయత్‌నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ డివిజన్ లెక్చరర్స్‌కాలనీలో నివసించే కేతుల జంగారెడ్డి అశ్విని(18)ను వరుసకు మేనబావ అయిన రాఘవేంద్రకాలనీలో నివసించే లింగారెడ్డి గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసుగు చెందిన అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అశ్విని తండ్రి, ఆమె బంధువులు లింగారెడ్డిపై దాడి చేయడంతో అతని తలకు గాయమైంది. దీంతో అశ్విని తండ్రి, అతని బంధువులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రేమ వేధింపులు తాళలేక బాలిక మృతి