ఎయిర్‌పోర్టు రోడ్డులో తప్పిన ప్రమాదం | Landslides on shamshabad airport road due to heavy rains | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు రోడ్డులో తప్పిన ప్రమాదం

Sep 24 2016 5:05 PM | Updated on Mar 28 2018 11:26 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం హైవే నుంచి ఎయిర్‌పోర్టు ప్రవేశ మార్గానికి వెళ్లే దారిలో కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అటువైపు ఎలాంటి వాహనాలు రాకపోవటంతో ప్రమాదం తప్పినట్లైంది. అప్రమత్తమైన జీఎంఆర్ సిబ్బంది అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు క్రేన్లను రంగంలోకి దించి కొండచరియలను తొలగించే పనులను చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement