కలిసుందామంటూ తీసుకెళ్లి కత్తితో దాడి.. | kiranyadav attacked by wife relatives | Sakshi
Sakshi News home page

కలిసుందామంటూ తీసుకెళ్లి కత్తితో దాడి..

Oct 6 2015 8:26 AM | Updated on Sep 3 2017 10:32 AM

కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు.

రంగారెడ్డి(షామీర్‌పేట): కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. వివరాలు..ఎల్బీనగర్‌లో బీఎన్ రెడ్డినగర్‌కు చెందిన కిరణ్ యాదవ్(23) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన దీపికా రెడ్డి అనే యువతిని ఇంట్లో తెలియకుండా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ సోమవారం సాయంత్రం సమయంలో యువతి బంధువులు కలిసి ఉందామని చెప్పి ఇంటికి తీసుకెళ్లే సమయంలో షామీర్పేటలోని కట్టమైసమ్మ రాజీవ్ రహదారి వద్ద యువకుడిపై కత్తితో దాడి చేశారు.

ఈ దాడిలో కిరణ్ ఛాతీపై , కాలిపై గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ కిరణ్ వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. యువకుడు ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement