breaking news
attack on youth
-
దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్‌పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్‌ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్‌పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్‌ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్‌గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. -
నోయిడాలో పోకిరీల బరితెగింపు
-
అమ్మాయి అని కూడా చూడకుండా పోకిరీల బరితెగింపు
సాక్షి, నోయిడా : గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. కొందరు యువకులు ఇద్దరు యువకులతోపాటు ఓ యువతిపై కూడా దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా వారిని బెదిరిస్తూ చావు దెబ్బలు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో వివాదాస్పద వైరల్ వీడియోగా మారింది. వివరాల్లోకి వెళితే గౌతమ్‌బుద్ధనగర్‌లో ఇద్దరు యువకులు, బ్యాగ్‌తో ఉన్న ఓ యువతి రోడ్డుపక్కన వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని సమీపించారు. వచ్చి రాగానే వారిపై కర్రలు, చెరుకు గడెలతో చావబాదారు. గౌతమ్‌బుద్ధనగర్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఫాంహౌస్ వద్ద దాడికి సంబంధించిన వీడియోను షూట్‌చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనవరి 1న ఈ ఘటన చోటుచేసుకోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తాము ఫాంహౌస్‌కు వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న ఇద్దరు దుండగులు తమ దగ్గరకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టారని, కొట్టారని పోలీసులకు వివరించారు. తమతో ఉన్న అమ్మాయిని కూడా వేధించి ఆమెను కూడా చావు దెబ్బలు కొట్టారని వాపోయారు. కాగా, పుటేజిలోని దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
కలిసుందామంటూ తీసుకెళ్లి కత్తితో దాడి..
రంగారెడ్డి(షామీర్పేట): కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. వివరాలు..ఎల్బీనగర్లో బీఎన్ రెడ్డినగర్‌కు చెందిన కిరణ్ యాదవ్(23) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన దీపికా రెడ్డి అనే యువతిని ఇంట్లో తెలియకుండా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ సోమవారం సాయంత్రం సమయంలో యువతి బంధువులు కలిసి ఉందామని చెప్పి ఇంటికి తీసుకెళ్లే సమయంలో షామీర్పేటలోని కట్టమైసమ్మ రాజీవ్ రహదారి వద్ద యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్ ఛాతీపై , కాలిపై గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ కిరణ్ వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. యువకుడు ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బార్లో లొల్లి.. రోడ్డు మీద ఫైటింగ్
గుంపుగా వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు పాన్‌షాపు దగ్గర పాన్ తీసుకుంటున్న ముగ్గురు వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడి చేసి వారి వద్ద నుంచి రూ.7వేల నగదు, సెల్ఫోన్లు దోచుకొనిపోయారు. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాలచందర్ తన స్నేహితులు రాకేశ్, మల్లేశ్‌లతో కలిసి మంగళవారం రాత్రి మూసారాంబాగ్ దగ్గర ఉన్న ఎస్ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్‌కు మద్యం సేవించడానికి వెళ్లారు. అక్కడ అనుకోకుండా రాకేష్ తాగుతున్న మద్యం గ్లాసు కిందపడింది. అందులో ఉన్న మద్యం పక్క టేబుల్‌పై ఉన్న ఒక వ్యక్తిపై పడింది. ఈ విషయంలో గొడవ ప్రారంభమైంది. బార్ యజమాని వచ్చి సముదాయించి క్షమాపణ చెప్పించారు. అక్కడ నుంచి వారు అలీకేఫ్ చౌరస్తాలోని శివానంద్ హోటల్ దగ్గర పాన్‌కోసం ఆగారు. అదే సమయంలో బార్లో గొడవ పడిన వారు ఆటోలో 12 మందితో గుంపుగా వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 7వేల నగదు, సెల్ఫోన్లు, హోండా వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. వాహనాన్ని మూసారాంబాగ్ బ్రిడ్జి అవతల వదిలి వెళ్లారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.