టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 62వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దమ్మగుడి అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 62వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దమ్మగుడిలో జన్మదిన వేడుకులు ఘనంగా జరిగాయి. పెద్దమ్మగుడిలో అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్దమ్మగుడిలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేసీఆర్ కేక్ కట్ చేశారు.