టెంపుల్ సిటీగా భద్రాచలం: కేసీఆర్ | kcr review on bhadrachalam temple development | Sakshi
Sakshi News home page

టెంపుల్ సిటీగా భద్రాచలం: కేసీఆర్

Apr 13 2016 6:45 PM | Updated on Aug 15 2018 9:30 PM

టెంపుల్ సిటీగా భద్రాచలం: కేసీఆర్ - Sakshi

టెంపుల్ సిటీగా భద్రాచలం: కేసీఆర్

యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలంను టెంపుల్ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు.

హైదరాబాద్: యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలంను టెంపుల్ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. బుధవారం భద్రాచలం ఆలయ అభివృద్ధిపై కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

భద్రాచలంలో సీతారాముల ఆలయం చుట్టూ ఉన్న రహదారులను మాడవీధులుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్ల దేవాలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్ణశాల, చిత్రకూట మంటపం, జఠాయువు మంటపాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement