ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిశారు
హైదరబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. దీపావళి సందర్భంగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరు పలు అంశాలపై సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
అంతకుముందు రాజ్ భవన్‌లో గవర్నర్ దంపతులు ప్రజాదర్బర్ నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో భాగంగా సాధారణ ప్రజలను కలుసుకున్న గవర్నర్ దంపతులు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇద్దరు సీఎంలు కలిసి చక్కదిద్దుకుంటారన్నారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.